25 టన్నుల ఎయిడ్ ను ఎయిర్ డ్రాప్ చేసిన యూఏఈ, జోర్డాన్
- July 28, 2025
యూఏఈ: గాజా స్ట్రిప్‌పై రెండు జోర్డాన్, ఒక ఎమిరాటీ విమానం 25 టన్నుల మానవతా సహాయాన్ని ఎయిర్ డ్రాప్ చేశాయని జోర్డాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. గాజాలో కొనసాగుతున్న మానవతా కార్యక్రమంలో భాగంగా ఎమిరేట్స్ వెంటనే గాజాకు వైమానిక దళ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని తెలిపిన విషయం తెలిసిందే. నిరంతర అంతర్జాతీయ సహాయ ప్రయత్నాల అత్యవసర అవసరాన్ని ఇది తెలియజేస్తుందని తన పోస్టులో పేర్కొన్నారు.
మరోవైపు, గాజాలోని కొన్ని ప్రాంతాలలో సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఆదివారం నుండి గాజాలోని మూడు ప్రాంతాలలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కాల్పులకు బ్రేక్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!