విజ్ ఎయిర్ ఎగ్జిట్ తర్వాత విమాన ఛార్జీలు పెరుగుతాయా?
- July 29, 2025
యూఏఈ: సెప్టెంబర్ 1 నాటికి విజ్ ఎయిర్ అబుదాబి కార్యకలాపాలను నిలిపివేయనుంది. ఈ నేపథ్యంలో యూఏఈలో విమాన ఛార్జీలను ప్రభావితం చేస్తాయా? అన్న చర్చలు జరగుతున్నాయి. వీటిపై ఎతిహాద్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆంటోనోల్డో నెవ్స్ స్పందించారు. ధరలు అనేది విమానయాన సంస్థ సదుపాయాలు, సీట్లు, డిమాండ్ లాంటి మార్కెట్ డైనమిక్స్ ద్వారా నిర్ణయించబడుతుందన్నారు. భవిష్యత్తులో ఫ్లైట్స్ సర్వీస్, డిమాండ్ ఎలా ఉంటుందనేది ముఖ్యమైన ప్రశ్న? అని అన్నారు. తక్కువ డిమాండ్ ఉంటే, ఛార్జీలు తగ్గుతాయని నెవ్స్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. విజ్ ఎయిర్ అబుదాబి ఎగ్జిట్ టికెట్ ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని అడిగినప్పుడు, ఆయన ఈ మేరకు స్పందించారు.
ఇటీవల విజ్ ఎయిర్..సెప్టెంబర్ 1, 2025 నుండి అబుదాబిలో కార్యకలాపాలను నిలిపివేస్తామని, దాని జాయింట్ వెంచర్‌ను రద్దు చేస్తామని ప్రకటించింది. Dh79 నుండి ప్రారంభమయ్యే దాని ప్రమోషనల్ ఛార్జీలు యూఏఈ ప్రయాణికులలో, ముఖ్యంగా తూర్పు యూరప్, CIS దేశాల టూరిజంలో మంచి ప్రజాదరణ పొందాయి.
2024లోనే విజ్ ఎయిర్ అబుదాబి 19,000 విమానాలను నడిపింది. 4.4 మిలియన్లకు పైగా అతి తక్కువ-ధర సీట్లను అందించింది. ఇది 3.5 మిలియన్లకు పైగా పాయింట్-టు-పాయింట్ ప్రయాణీకులను తీసుకెళ్లింది. జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం మొత్తం పాయింట్-టు-పాయింట్ ట్రాఫిక్‌కు దాదాపు 25 శాతం వాటా సాధించింది. గత సంవత్సరం అబుదాబికి 1.2 మిలియన్లకు పైగా అంతర్జాతీయ టూరిస్టులను ఎయిర్‌లైన్ తీసుకువచ్చింది.
లండన్‌కు చెందిన స్ట్రాటజిక్ ఏరో రీసెర్చ్ చీఫ్ అనలిస్ట్ సాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఎతిహాద్ ఛార్జీలను పెంచుతుందనే భావనను వ్యక్తపరిచారు. ఇతర ఫ్లైట్స్ అందుబాటులో లేకపోతే, ఛార్జీలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఒక వేళ సర్వీసులు అందుబాటులో ఉంటే ధరల్లో తేడా ఉండకపోవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!