అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్..

- July 30, 2025 , by Maagulf
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్..

ఆగస్టు 1న అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు రేపు (జూలై 31) మధ్యాహ్నం 12 గంటల (Amazon Freedom Sale) నుంచి ముందస్తుగా యాక్సెస్‌ను పొందవచ్చు.ఈ సేల్ సమయంలో అనేక స్మా్ర్ట్‌ఫోన్లు, ఇతర గాడ్జెట్ల పై అత్యంత తక్కువ ధరలకు పొందవచ్చు.

అదనంగా, ఎస్బీఐ కార్డ్ హోల్డర్లు అదనంగా 10శాతం ఇన్‌స్టంట్ తగ్గింపును పొందవచ్చు. మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ లేదా బడ్జెట్ ఫ్రెండ్లీ ఏదైనా అమెజాన్ ఇప్పటివరకు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ జాబితాను అందిస్తోంది.

ఈ సేల్ సందర్భంగా ఆపిల్, శాంసంగ్, ఐక్యూ వంటి టాప్ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ 40శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ప్రీమియం ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ డీల్స్ అసలు వదులుకోవద్దు.

టాప్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే:
శాంసంగ్ కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అందులో ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S24 అల్ట్రా, కొత్త ఫోల్డబుల్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఉన్నాయి. మీరు హై-ఎండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం చూస్తుంటే.. బడ్జెట్-ఫ్రెండ్లీ 5G ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్స్ అసలు వదులుకోవద్దు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి బెస్ట్ శాంసంగ్ డీల్స్ వరకు ఫుల్ డిటెయిల్స్ ఇప్పుడు చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ అసలు ధర రూ.1,34,999 నుంచి రూ.79,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటుంది.
గెలాక్సీ Z ఫోల్డ్ 6 : గెలాక్సీ Z ఫోల్డ్ 6 అసలు ధర రూ.1,64,999 నుంచి రూ.1,24,999 తగ్గింపు ధరకు లభిస్తుంది. మీరు ఫోల్డబుల్ ఫోన్ కోసం ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం కావచ్చు.
గెలాక్సీ M36 5G : శాంసంగ్ గెలాక్సీ M36 5G, బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ.15,999కు సేల్ సమయంలో అందుబాటులో ఉంటుంది.
గెలాక్సీ M06 5G : శాంసంగ్ గెలాక్సీ M06 5G అసలు ధర రూ.13,999 నుంచి రూ.8,499కి అందుబాటులో ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com