సింగపూర్‌లో బాలికపై లైంగిక దాడి: భారతీయుడికి జైలు శిక్ష
- July 31, 2025
సింగపూర్: సింగపూర్ లో ఒక 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన భారత సంతతికి చెందిన వ్యక్తికి కోర్టు 14 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించింది.
దుకాణంలోనే దారుణం: 2021 లో జరిగిన ఘటన
58 ఏళ్ల రామలింగం సెల్వశేఖరన్ అనే వ్యక్తి, 2021 అక్టోబర్ 28న జూరాంగ్ వెస్ట్ ప్రాంతంలోని తన ప్రొవిజన్ దుకాణంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఐస్‌క్రీమ్ కొనడానికి వచ్చిన చిన్నారిని, తన షాప్ వెనుక భాగానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించినట్లు కేసులో పేర్కొనబడింది. వేధింపులకు గురైన బాలిక, దగ్గరలోని ఒక వ్యక్తి సహాయంతో పోలీసులకు ఘటనను ధైర్యంగా నివేదించింది. వెంటనే అధికారులు స్పందించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ జనవరి 16న మొదలై, జూలై 7న దోషికి శిక్ష ఖరారైంది.
నిందితుడి వాదనలు–కోర్టు తిప్పి కొట్టింది
రామలింగం తన ఆరోగ్య సమస్య కారణంగా లైంగిక దాడి జరగలేదని, తన డీఎన్ఏ ఆనవాళ్లు బాధితురాలిపై లేవని వాదించాడు. కానీ కోర్టు ఈ వాదనలను అంగీకరించలేదు. జస్టిస్ ఐడాన్ జు మాట్లాడుతూ–బాలిక అందించిన సాక్ష్యం స్థిరంగా, నమ్మదగినదిగా ఉన్నదని వ్యాఖ్యానించారు. రామలింగం పోలీసులకు మొదట ఇచ్చిన వాంగ్మూలంలో చిన్నారిని హత్తుకోవడం, ముద్దుపెట్టడం, లైంగిక చర్యలు జరిపినట్లు అంగీకరించినట్టు వివరించారు. తర్వాత అది తిరస్కరించడం, నిజాన్ని దాచేందుకు చేసిన యత్నంగా కోర్టు అభిప్రాయపడింది.
బెయిల్‌పై విడుదల–అప్పీల్‌కు సిద్ధం
కోర్టు 14 సంవత్సరాల జైలు శిక్షతో పాటు, కఠినమైన శారీరక శిక్ష విధించింది.అయితే రామలింగం తనపై వచ్చిన తీర్పును అప్పీల్ చేస్తానని తెలిపాడు.రూ.80 వేల సింగపూర్ డాలర్లు చెల్లించి అతను బెయిలుపై విడుదలయ్యాడు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!