యూఏఈలో 51.8°Cకి చేరుకున్న ఉష్ణోగ్రతలు..!!
- August 02, 2025
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధిక స్థాయికి చేరాయి. తాజాగా 51.8°C ఉష్ణోగ్రత నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. అల్ ఐన్లోని స్వీహాన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. కాగా, మే 24న స్వీహాన్లో కూడా 51.6°C ఉష్ణోగ్రత నమోదైంది.
జూలై 29 -ఆగస్టు 10 మధ్య వచ్చే అల్ మిర్జామ్ కాలం రాకతో దేశంలో వాతావరణ పరిస్థితులు మరింత వేడిగా ఉంటాయని భావిస్తున్నారు. ఆగస్టు 10 వరకు, అత్యంత వేడి పరిస్థితులు తీవ్రమైన పొడి గాలులతో కూడి ఉంటాయని వెల్లడించింది. ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు తీవ్రమైన వేడి కారణంగా నివాసితులు బయటకు వెళ్లకుండా ఉండాలని, పగటిపూట చల్లని ప్రదేశాలలో ఉండాలని సూచించారు.
మరోవైపు, ఈ వేడి పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు, బలమైన గాలులు వీచాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు.యూఏఈలో 51.8°Cకి చేరుకున్న ఉష్ణోగ్రతలు..!!
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధిక స్థాయికి చేరాయి. తాజాగా 51.8°C ఉష్ణోగ్రత నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. అల్ ఐన్లోని స్వీహాన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. కాగా, మే 24న స్వీహాన్లో కూడా 51.6°C ఉష్ణోగ్రత నమోదైంది.
జూలై 29 -ఆగస్టు 10 మధ్య వచ్చే అల్ మిర్జామ్ కాలం రాకతో దేశంలో వాతావరణ పరిస్థితులు మరింత వేడిగా ఉంటాయని భావిస్తున్నారు. ఆగస్టు 10 వరకు, అత్యంత వేడి పరిస్థితులు తీవ్రమైన పొడి గాలులతో కూడి ఉంటాయని వెల్లడించింది. ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు తీవ్రమైన వేడి కారణంగా నివాసితులు బయటకు వెళ్లకుండా ఉండాలని, పగటిపూట చల్లని ప్రదేశాలలో ఉండాలని సూచించారు.
మరోవైపు, ఈ వేడి పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు, బలమైన గాలులు వీచాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..
- తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ