కువైట్ వ్యాప్తంగా సెక్యూరిటీ, ట్రాఫిక్ క్యాంపెయిన్..పలువురు అరెస్ట్..!!
- August 02, 2025
కువైట్: మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు కువైట్ వ్యాప్తంగా సెక్యూరిటీ, ట్రాఫిక్ క్యాంపెయిన్ ను ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.తనిఖీల సందర్భంగా వాంటెడ్ వ్యక్తులు, ట్రాఫిక్-రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించేవారిని పట్టుకోవడం లక్ష్యమన్నారు.వివిధ డిపార్టుమెంట్ల సహకారంతో సంయుక్తంగా తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ తనిఖీలు సందర్భంగా, 934 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే, రెసిడెన్సీ-కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు 13 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. గుర్తింపు పత్రాలు లేని ఆరుగురిని, 9 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేశారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అనుమానిత మాదకద్రవ్యాలు, మద్యం కలిగి ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. భద్రతా సిబ్బందితో సహకరించాలని, అన్ని ప్రాంతాలలో ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!