సెమీస్ కు దూసుకెళ్లిన‌ లక్ష్యసేన్, తరుణ్..

- August 02, 2025 , by Maagulf
సెమీస్ కు దూసుకెళ్లిన‌ లక్ష్యసేన్, తరుణ్..

మకావ్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌, తరుణ్ మన్నేపల్లి సెమీఫైనల్స్‌ చేరగా, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ నిష్క్రమించింది.

  • కామన్వెల్త్ గేమ్స్ విజేత లక్ష్య సేన్ ఈ సంవ‌త్స‌రంలో తొలిసారి BWF వరల్డ్ టూర్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు.చైనాకు చెందిన జూ షుయాన్ చెన్‌ను 21-14, 18-21, 21-14 తేడాతో ఓడించాడు. ఈ మ్యాచ్ సుమారు ఒక గంట మూడు నిమిషాల పాటు సాగింది.
  • తరుణ్ మన్నేపల్లి కూడా అద్భుత ప్రదర్శనతో తన తొలి BWF వరల్డ్ టూర్ సెమీఫైనల్‌లో అడుగుపెట్టాడు. చైనా ఆటగాడు హూ జె అన్నపై 21-12, 13-21, 21-18 తేడాతో విజయం సాధించాడు. ఈ పోరు ఒక గంట 15 నిమిషాల పాటు జరిగింది.
  • సెమీ ఫైనల్స్‌లో లక్ష్య సేన్ ఇండోనేషియా క్రీడాకారుడు ఆల్వీ ఫర్హాన్‌ను, తరుణ్ మలేషియాకు చెందిన జస్టిన్ హోను ఎదుర్కొనబోతున్నారు.
  • మరోవైపు, ప్రపంచ మాజీ నంబర్ వన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి – చిరాగ్ శెట్టి మాత్రం క్వార్టర్‌ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. మలేషియా జంట చూం హాన్ జియాన్–ముహమ్మద్ హైకల్ చేతిలో 14-21, 21-13, 22-20 తేడాతో ఓటమి చవిచూశారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com