ఈ-సిగరెట్లు,వేప్‌ల పై నిషేధం..చర్చించనున్న బహ్రెయిన్ పార్లమెంట్..!!

- August 03, 2025 , by Maagulf
ఈ-సిగరెట్లు,వేప్‌ల పై నిషేధం..చర్చించనున్న బహ్రెయిన్ పార్లమెంట్..!!

మనామా: ఎలక్ట్రానిక్ స్మోకింగ్ పరికరాల ప్రమాదాల నుండి యువతను రక్షించే దిశగా బహ్రెయిన్ త్వరలో ఒక ప్రధాన అడుగు వేయనుంది. రాబోయే పార్లమెంట్ సమావేశంలో ఎలక్ట్రానిక్ షిషా ,  ఈ-సిగరెట్లు (వేప్‌లు) అమ్మకాన్ని నిషేధించే ముసాయిదా చట్టంపై చర్చిస్తామని ఎంపీ జలాల్ కజెం అల్-మహ్ఫౌద్ వెల్లడించారు. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లలో వేపింగ్‌కు సంబంధించిన పెరుగుతున్న ఆరోగ్య ప్రమాదాలను పరిష్కరించడం ఈ ప్రతిపాదన లక్ష్యం అని అల్-మహ్ఫౌద్ అన్నారు. ఆకర్షణీయమైన రుచులు, సోషల్ మీడియా ప్రమోషన్లు ఈ ఉత్పత్తులను యువతలో బాగా ప్రాచుర్యం పొందాయని, ఇవి సాంప్రదాయ సిగరెట్లకు "సురక్షితమైన" ప్రత్యామ్నాయం అనే తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించాయని ఆయన పేర్కొన్నారు.
వీటి అమ్మకాలను కఠినంగా పర్యవేక్షించాలని, సురక్షితమైన ప్రత్యామ్నాయాలుగా ఇ-సిగరెట్లను మార్కెటింగ్ చేయడాన్ని నిషేధించాలని పిలుపునిచ్చారు. గల్ఫ్ దేశాలలో, అలాగే కెనడా, భారతదేశం, సింగపూర్ వంటి దేశాలలో విజయవంతమైన నిషేధాల నుండి పాఠాలు నేర్చుకోవాలని కూడా ఆయన సూచించారు.ఆరోగ్య అధికారులు, పాఠశాలలో వేపింగ్ ప్రమాదాల గురించి అవగాహన పెంచాలని ఎంపీ కోరారు. ఆన్‌లైన్ ప్రమోషన్‌ను నిషేధించడం, అమ్మకాల కేంద్రాలను నియంత్రించడం వంటి కఠినమైన చట్టాలను రూపొందించాలని కోరారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com