సౌదీ ప్రీమియం రెసిడెన్సీ కోసం 40వేల మంది దరఖాస్తు..!!

- August 07, 2025 , by Maagulf
సౌదీ ప్రీమియం రెసిడెన్సీ కోసం 40వేల మంది దరఖాస్తు..!!

రియాద్: సౌదీ అరేబియా ప్రీమియం రెసిడెన్సీ కోసం ఇన్వెస్టర్లు పోటీ పడుతున్నారు. జనవరి 2024 నుంచి జూలై 2025 మధ్య దేశ, విదేశాలకు చెందిన వారి నుంచి  40,163 దరఖాస్తులు వచ్చాయి. ప్రీమియం రెసిడెన్సీ స్కీమ్ ను ప్రకటించిన 2024లో మొత్తం 8,074 మందికి రెసిడెన్సీలను జారీ చేశారు.  అత్యధికంగా  అసాధారణ ప్రతిభ కలిగిన 5,578 మందికి రెసిడెన్సీ పర్మిట్లు ఇవ్వగా.. టాలెంట్ వర్గానికి 348 పర్మిట్లు జారీ చేశారు.  ఆ తర్వాత స్థానాల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు, బిజినెస్ ఇన్వెస్టర్లు ఉన్నారు.  

ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లకు అనేక రకాల బెనిఫిట్లను అందిస్తున్నారు. అపరిమిత ఫ్యామిటీ రెసిడెన్సీ అనుమతితోపాటు వీసా లేకుండానే ఎన్నిసార్లయిన రాకపోకలు సాగించవచ్చు. అలాగే,  ప్రవాస ట్యాక్స్  నుండి మినహాయింపు పొందడంతోపాటు ప్రాపర్టీలను, సొంతంగా వాహనాలను కలిగి ఉండవచ్చు. స్పాన్సర్ లేకుండా ప్రైవేట్ రంగంలో జాబ్ చేసే అవకాశాలను పొందవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com