కువైట్ రెస్టారెంట్ లైసెన్స్ లలో పెరుగుదల నమోదు..!!
- August 08, 2025
కువైట్: కువైట్ లో రికార్డు స్థాయిలో కొత్త రెస్టారెంట్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 520 వాణిజ్య లైసెన్స్‌లను కొత్త జారీ చేసినట్లు కువైట్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక జనవరిలో 196, ఫిబ్రవరిలో 180 మరియు మార్చిలో 144 లైసెన్సులను జారీ చేసినట్లు తెలిపింది.
మంత్రిత్వ శాఖ జారీ చేసిన మొత్తం లైసన్సులలో జనరల్ ట్రేడ్ లైసెన్సుల వాటా 44.4 శాతం, రెస్టారెంట్ల వాటా 12.88 శాతం, మెయింటనెన్స్ అండ్ రిపేర్ల సేవలు 10.4 శాతం ఉన్నాయి. ఇతర రంగాలలో టెక్స్ టైల్, ట్రాన్స్ పోర్ట్, రియల్ ఎస్టేట్, ఫుడ్ ఇండస్ట్రీ, టూరిజం, ఎడ్యుకేషన్ వంటి రంగాలలో తక్కువ సంఖ్యలో లైసెన్సులు జారీ అయినట్లు తెలిపారు. ఇక కంపెనీ లైసెన్సులు 2024 మొదటి త్రైమాసికంలో 6,919తో పోలిస్తే, ఈ ఏడాది 21.3 శాతం పెరిగి 8,390కి చేరుకున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!