ఒమన్ లో కీలక వాటర్ నెట్‌వర్క్ ప్రాజెక్టులు పూర్తి..!!

- August 08, 2025 , by Maagulf
ఒమన్ లో కీలక వాటర్ నెట్‌వర్క్ ప్రాజెక్టులు పూర్తి..!!

అల్-ముధైబి: ఉత్తర అషర్కియా గవర్నరేట్‌లో కీలమైన వాటర్ నెట్ వర్క ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసుకుంటోంది.  అల్ ముధైబిలోని వాడి అండమ్ గ్రామాలలో నామా వాటర్ సర్వీసెస్ ద్వారా అమలవుతున్న ఈ వాటర్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్ ను RO 3,668,000 తో నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు దాదాపు 93 శాతం దాటాయని తెలిపారు.

వాడి అండమ్ వాటర్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌లో భాగంగా అల్-హబాత్ గ్రామంలో ఉన్న ఖద్రా బని దఫా పంపింగ్ స్టేషన్‌ విస్తరణ పనులతోపాటు  90 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో మూడు కొత్త ఫైబర్‌గ్లాస్ ట్యాంకులను నిర్మిస్తున్నారు. వీటితోపాటు అల్-వాషల్,  అల్-ఫులైజ్ గ్రామాలలో రెండు బూస్టర్ పంపింగ్ స్టేషన్లు రానున్నాయి. దాదాపు 102 కిలోమీటర్లు మేర ఉండే పైప్ లైన్ ద్వారా వాడి అండమ్ లోని తొమ్మిది గ్రామాలలో మంచినీటి అవసరాలను తీర్చుతుందని పేర్కొన్నారు.

రెండవ దశను RO 15,132,000 తో 2027 నాటికి పూర్తి చేయనున్నారు. ఇందులో 40 కి.మీ ట్రాన్స్‌మిషన్ పైప్‌లైన్, 217 కి.మీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, 4,065 గృహ కనెక్షన్లు, పంపింగ్ స్టేషన్ మరియు ఎలివేటెడ్ ట్యాంక్ ఉన్నాయి. మరోవైపు అల్-తయీన్ విలాయత్‌లలో వాటర్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోందని గమనించాలి. 36 నెలల ప్రాజెక్టులో అల్-ముధైబీలోని అల్-జర్దా, దమాలోని మహ్లా మరియు అల్-తయీన్ మధ్య 77.85 కి.మీ నీటి ప్రసార పైప్‌లైన్, 3 వేల నుండి 10 వేల క్యూబిక్ మీటర్ల మధ్య నిల్వ సామర్థ్యం కలిగిన ఏడు పంపిణీ ట్యాంకులు, అల్-జర్దా మరియు అల్-రహ్బా ప్రాంతాలలో రెండు పంపింగ్ స్టేషన్లు ఉంటాయని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com