సౌదీ అరేబియాలో గ్రూప్ హౌసింగ్ కోసం హెల్త్, సెఫ్టీ రూల్స్..!!

- August 10, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో గ్రూప్ హౌసింగ్ కోసం హెల్త్, సెఫ్టీ రూల్స్..!!

రియాద్: గ్రూప్ హౌసింగ్ యూనిట్ల కోసం కొత్తగా హెల్త్, సేఫ్టీ రూల్స్ ను సౌదీ అరేబియా ప్రకటించింది. బిల్డింగ్ ఎత్తు మరియు స్థలం,  పార్కింగ్ లభ్యత మరియు ఇతర ముఖ్యమైన సేవలను కవర్ చేసింది. జనాభా ప్రతిపాదికన రెసిడెన్షియల్ బిల్డింగ్ , రెసిడెన్షియల్ కాంప్లెక్స్, మొబైల్ క్యాబిన్‌ అను మూడు వర్గాలుగా విభజించారు.

రెసిడెన్షియల్ బిల్డింగ్ ను 500 మందికి పరిమితం చేశారు.  ప్రతి బెడ్‌రూమ్‌కు వ్యక్తికి కనీసం 4 చదరపు మీటర్లు ఉండాలి, 10 కంటే ఎక్కువ మంది ఉండకూడదు. ప్రతి ఎనిమిది మంది కి రెండు కిచెన్లు, రెస్ట్ రూమ్స్, భాత్  లాండ్రీ రూములు, తాగునీరు, క్లినింగ్ సేవలతోపాటు ఫెస్ట్ కంట్రోల్ సౌకర్యాలు ఉండాలి. 

ఇక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 10,000 మంది వరకు వసతి కల్పించవచ్చు. నివాస స్థలం మరియు ఆక్యుపెన్సీ ప్రమాణాలను కలిగి ఉండాలి.  అంతేకాకుండా ప్రతి అంతస్తుకు రెండు కిచెన్లు, ప్రేయర్ రూమ్,  లాండ్రీ సౌకర్యాలు ఉండాలి.  ప్రతి 1,000 మంది నివాసితులకు ఎమర్జెన్సీ రూమ్స్, ప్రతి 5,000 మందికి ఒక మెడికల్ క్లినిక్ ఉండాలి.

అలాగే, ప్రాజెక్టుల వద్ద తాత్కాలిక ఉపయోగం కోసం రూపొందించబడిన మొబైల్ క్యాబిన్‌లు ఒకే ఆక్యుపెన్సీ నియమాలను వర్తిసాయని తెలిపారు. సెంట్రల్ కిచెన్, ప్రేయర్ రూమ్, హెల్త్ ఐసోలేషన్ రూమ్, లాండ్రీ సౌకర్యాలు, అత్యవసర గదులు, క్లినిక్‌లు మరియు వాతావరణ నియంత్రణలు కలిగి ఉండాలి.

వీటితోపాటు సైట్‌లలో ఇంధన స్టేషన్లు, EV ఛార్జింగ్ పాయింట్లు, మరమ్మతు కేంద్రాలు, వాణిజ్య మరియు సేవా ప్రాంతాలు, పార్కింగ్, వాకింగ్ మరియు సైకిల్ రూట్స్, ఎంటర్ టైన్ సౌకర్యాలు మరియు ఆధునిక లైటింగ్ ఉండాలి. ప్రతి 100 మంది నివాసితులకు ఒక పార్కింగ్ స్థలం, జనాభాలో 50% మందికి బస్ పార్కింగ్ మరియు వికలాంగుల కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించాలి.  భవన నిర్మాణారికి  సంబంధిత అన్ని అనుమతులను పూర్తి డాక్యుమెంటేషన్ తో అధికారులకు సమర్పించి, అనుమతి పొందాలని కొత్త నిబంధనల్లోనిర్దేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com