తొలిసారిగా ఆస్కార్ ఎంట్రీకి దరఖాస్తులు.. సౌదీ ఫిల్మ్ కమిషన్

- August 11, 2025 , by Maagulf
తొలిసారిగా ఆస్కార్ ఎంట్రీకి దరఖాస్తులు.. సౌదీ ఫిల్మ్ కమిషన్

రియాద్: మొదటిసారిగా, సౌదీ ఫిల్మ్ కమిషన్ 98వ అకాడమీ అవార్డులకు సౌదీ అరేబియా తన ఎంట్రీని పంపనుంది. ఇందుకోసం సమర్పించాలని సూచించింది. గతంలో కమిషన్ ఈ ప్రక్రియను స్వంత ప్రమాణాల ఆధారంగా డైరెక్ట్ నామినేషన్ల ద్వారా స్వీకరించేది. ఈ మేరకు అధికారిక నియమాలు, అర్హత ప్రమాణాలు ఉండాలని సూచించింది. తుది నిర్ణయం నిర్వాహక సంస్థ అయినా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉంటుందని తెలిపారు. మార్గదర్శకాలు స్వతంత్ర ఎంపిక కమిటీ ఏర్పాటు, చలనచిత్ర అర్హత అవసరాలు మరియు వివరణాత్మక సమర్పణ సూచనలను వివరిస్తాయి.

అంతర్జాతీయ వేదికలలో సౌదీ సినిమా ఉనికిని బలోపేతం చేయడానికి..  ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ప్రొఫైల్‌ను పెంచే ప్రయత్నాలలో ఈ చర్య ఒక భాగమన్నారు. పూర్తి నిబంధనలు, అర్హత వివరాలు అకాడమీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుల సమర్పణతోపాటు పూర్తి వివరాలను ఈ [email protected] కు పంపాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com