ఏపీ ఆలయాల్లో ఇక పై అవి నిషేధం..

- August 11, 2025 , by Maagulf
ఏపీ ఆలయాల్లో ఇక పై అవి నిషేధం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయాల పవిత్రతను కాపాడడం మాత్రమే కాకుండా ఆలయాలలో పర్యావరణ పరిరక్షణకు కూడా పెద్దపీట వేస్తుంది. మనం ఏ ప్రముఖ ఆలయానికి వెళ్ళినా అక్కడ పూజా సామాన్లు తీసుకున్న దగ్గర నుండి ఆలయంలో నుండి బయటకు వచ్చేవరకు ప్రతి దానిలో ప్లాస్టిక్ వినియోగం ఖచ్చితంగా ఉంటుంది.

ప్లాస్టిక్ కవర్లలో పూజ సామాన్లను తీసుకువెళ్లడం నిత్యకృత్యంగా మారింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాలలో ఇకనుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్స్ ను తీసుకు వెళ్లడం నిషేధించబడింది. ఆలయాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిస్తూ ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈనెల 8వ తేదీన జీవో జారీ చేశారు. ఇక కమిషనర్ ఆదేశాలను అమలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలలోని దేవాదాయ శాఖ సిబ్బంది రెడీ అయ్యారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తీసుకు రాకుండా చర్యలు పూజ సామాగ్రి తీసుకురావడం దగ్గర నుండి ప్రసాదం అందించే వరకు ఎవరు ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకూడదని సిబ్బందికి సూచిస్తున్నారు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తున్నారు. దేవాదాయ శాఖ అందించే ప్రసాదాన్ని అరిటాకులో కానీ, విస్తరాకులతో తయారుచేసిన కప్పులో కానీ ఇవ్వాలని సూచిస్తున్నారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ఆలయ దుకాణ సముదాయం లోకి తీసుకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయించిన వారి పైన కఠిన చర్యలు ప్రతిరోజు తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు విక్రయించిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇక ఆలయంలో త్రాగు నీటిని ఇవ్వడానికి ఉపయోగించే గ్లాసులు కూడా స్టీల్ క్లాసులే పెడుతున్నట్టు, ప్లాస్టిక్ గ్లాసులలో నీళ్లు ఇవ్వడం ఇకపై ఉండబోదని చెబుతున్నారు. ఇక తాగునీటి బాటిల్స్ విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com