కువైట్‌లో తగ్గిన ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రమాదాలు..!!

- August 12, 2025 , by Maagulf
కువైట్‌లో తగ్గిన ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రమాదాలు..!!

కువైట్ః ఈ ఏడాది కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలు, రోడ్ యాక్సిడెంట్ల సంఖ్యలో తగ్గుదల నమోదైంది. ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య గత సంవత్సరం 1,968,733 నుండి ఈ సంవత్సరం 1,659,448కి తగ్గింది. ఇది 16% తగ్గుదల అని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ తన తాజా నివేదికలో వెల్లడించింది. అలాగే 45శాతం యాక్సిడెంట్లు తగ్గాయి. గత ఏడాది 2,511 రోడ్ యాక్సిడెంట్లు జరుగగా, ఈ ఏడాది 1,383 మాత్రమే నమోదు అయినట్లు తెలిపింది. యాక్సిడెంట్లలో మరణాలు కూడా 34శాతం తగ్గాయని తెలిపింది. గత సంవత్సరం 143 ప్రమాదాలు నమోదుకాగా, ఈ ఏడాది 94కి తగ్గాయని పేర్కొంది.  
కువైట్ అమలు చేస్తున్న కఠినమైన ట్రాఫిక్ నియంత్రణ, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థలు, నిరంతర అవగాహన క్యాంపెయిన్ ల కారణంగా ఈ తగ్గుదల నమోదైనట్లు అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com