పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ
- August 12, 2025
పోలీసుల విచారణకు హాజరైన రామ్‌గోపాల్ వర్మ
ఒంగోలు: ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ వివాదం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ వర్మకు నోటీసులు జారీ చేసిన ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, స్టేషన్లో విచారణ చేపట్టారు. వర్మ తగిన సమయానికి హాజరయ్యారు.
గత వైసీపీ (YCP) ప్రభుత్వానికి వ్యతిరేకంగా రూపొందించిన ‘వ్యూహం’ సినిమా ప్రచారంలో భాగంగా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేశ్‌ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారన్న ఆరోపణలు రామ్ గోపాల్ వర్మపై వచ్చాయి. దీని ఆధారంగా 2024 నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి 7న వర్మ విచారణకు హాజరయ్యారు. అయితే, విచారణ కొనసాగిస్తూ మళ్లీ నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు మరోసారి పోలీసుల ముందు హాజరయ్యారు.ప్రస్తుతం వర్మను ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. విచారణ ముగిసిన తర్వాత కేసు పురోగతి పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్