29న విడుదల కానున్న 'పెళ్లిచూపులు'

- July 17, 2016 , by Maagulf

విజయ్‌ దేవరకొండ, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం 'పెళ్లిచూపులు'. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించారు. ఈనెల 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నిర్మాతను ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు అభినందించారు. ఇటీవల కాలంలో ఇలాంటి విభిన్న చిత్రాన్ని చూడలేదని, ఇటువంటి చిత్రాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌పై రాజ్‌ కందుకూరి, యశ్‌ రంగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. డి.సురేష్‌బాబు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com