రాధారాణి ఆర్ట్స్ అండ్ మ్యూజికల్స్ సంస్థ ప్రారంభం
- August 12, 2025
హైదరాబాద్: శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన గాయని రాధారాణి, అనేక సంగీత విభావరుల్లో తన మధుర గానంతో ప్రతిభను చాటుకున్నారని వంశీ సంస్థల రధసారధి శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు అన్నారు.
శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికలో రాధారాణి ఆర్ట్స్ అండ్ మ్యూజికల్స్ అనే నూతన సంస్థ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది.ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ, రాధారాణి తన తల్లి చిట్టూరి జానకీదేవి సంగీత వారసత్వాన్ని గౌరవంగా కొనసాగిస్తున్నారని, ఆమె కేవలం మధుర గాయని మాత్రమే కాకుండా పలు సేవా కార్యక్రమాల్లోనూ నిరుపేదలకు అండగా నిలుస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. నేడు రాధారాణి తన పేరుతో సంగీత సంస్థను ప్రారంభించడం సముచితమని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన సంగీత విభావరులను నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కిన్నెర సంస్థ కార్యదర్శి మద్దాళి రఘురామ్, అంతర్జాతీయ గాయకులు వై.ఎస్.రామకృష్ణ,డాక్టర్ చింతలపూడి త్రినాథ రావు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ తెన్నేటి సుధాదేవి తదితరులు హాజరై, రాధారాణి కొత్త మ్యూజికల్స్ సంస్థ స్థాపన పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సంస్థ లోగోను అతిథులు ఆవిష్కరించారు.
గాయని రాధారాణి తన కొత్త సంస్థ లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. అనంతరం, వంశీ ఇంటర్నేషనల్ సంస్థ తరఫున రాధారాణి, రంగారావు దంపతులను ఘనంగా సత్కరించి సన్మాన పత్రాలను అందజేశారు.
ఈ వేడుకలో గంటి రమకృష్ణ, రవిసశంకర్ టాగూర్, కె.వి.రావు, రవీంద్రనాథ్ ఆచార్య, లలిత, సుధామయి, మధుర వీణ, రేణుకా రమేష్, స్వరకల్యాణి, శైలజ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముందుగా, బహుగళ గాయకుడు వై.ఎస్. రామకృష్ణ నిర్వహణలో "అమ్మ అన్నది ఒక కమ్మని మాట" అనే శీర్షికతో సినీ సంగీత విభావరి జరిగింది. ఇందులో రామకృష్ణ బృందానికి చెందిన గాయకులు, గాయనీలు పలు తెలుగు చిత్రాల యుగళగీతాలు, ఏకగళ గీతాలను మధురంగా ఆలపించి సభను అలరించారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి