కొన్ని CBSE పాఠశాలల్లో త్వరలో ఓపెన్ బుక్ ఎగ్జామ్స్..!!

- August 14, 2025 , by Maagulf
కొన్ని CBSE పాఠశాలల్లో త్వరలో ఓపెన్ బుక్ ఎగ్జామ్స్..!!

యూఏఈ: యూఏఈలోని విద్యార్థులు ఓపెన్-బుక్ అసెస్‌మెంట్స్ (OBAs) కోసం సిద్ధమవుతున్నారు. కొన్ని CBSE-అనుబంధ పాఠశాలలు ఈ కొత్త రకాల పరీక్షలను నావిగేట్ చేయడానికి టీచర్లకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇప్పిస్తున్నారు. 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2026-27 విద్యా సంవత్సరం నుండి 9వ తరగతికి OBAలను ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపింది. అయితే, ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరించమని పాఠశాలలకు చెప్పినప్పటికీ, అమలును వారి ఇష్టానికి వదిలేశారు.  

ఈ కొత్త విధానం బట్టీ పట్టడం నుండి కొత్త లెర్నింగ్ మెథడ్స్ కు మారవలసిన అవసరాన్ని చెబుతుందని అబుదాబిలోని షైనింగ్ స్టార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ అభిలాషా సింగ్ తెలిపారు. పుస్తకాన్ని పూర్తిగా చదవకపోతే సమాధానాలు గుర్తించడం అంత సులభం కాదన్నారు.     

CBSE గతంలో ఓపెన్-బుక్ అసెస్‌మెంట్‌లను అమలు చేసింది.  2014లో 9వ తరగతి విధ్యార్థులకు ప్రయోగాత్మకంగా ఓపెన్ టెక్స్ట్ బేస్డ్ అసెస్‌మెంట్ ను ప్రారంభించింది. అయితే, మిశ్రమ ఫలితాలు, టీచర్లలో భిన్నభిప్రాయాలు  వ్యక్తమవ్వడంతో 2017–18 విద్యా సంవత్సరంలో దీనిని నిలిపివేశారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com