పార్లమెంటు సమావేశాల్లో హైకోర్టు విభజనే ప్రధాన అజెండా.

- July 17, 2016 , by Maagulf
పార్లమెంటు సమావేశాల్లో హైకోర్టు విభజనే ప్రధాన అజెండా.

 సోమవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... తెరాస ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం దిల్లీలో జరిగింది. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ ఉన్నత న్యాయస్థానం విభజించకపోవడంపై కేంద్రాన్ని ప్రశ్నించాలని ఎంపీలకు కేసీఆర్‌ సూచించారు. అదేవిధంగా కేంద్రం తీసుకొస్తున్న పలు విధానాలపై అంశాల వారీగా మద్దతు తెలపాలని పేర్కొన్నారు.
సమావేశం అనంతరం ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుకు తెరాస సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. రేపు ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్‌ భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. హైకోర్టు విభజన అంశం ప్రధాన అజెండాగా పార్లమెంటులో తమ వైఖరి ఉండబోతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్‌ కాకతీయ, హరితహారం వంటి కార్యక్రమాలకు కేంద్రం నుంచి ఆర్ధిక సహకారం అందించాలని కోరతామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com