లోక్‌సభ వ్యవహారాలను కాగిత రహిత వ్యవస్థగా ..

- July 17, 2016 , by Maagulf
లోక్‌సభ వ్యవహారాలను కాగిత రహిత వ్యవస్థగా ..

కాగితరహిత సేవల లక్ష్యంగా లోక్‌సభ -వెబ్‌సైట్‌ను ప్రారంభించిన స్పీకర్ సుమిత్ర మహాజన్  పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించిన డాక్యుమెంట్లను డిజిటలైజేషన్ చేయడం ద్వారా 1000 చెట్లను రక్షించి ఉంటామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. లోక్‌సభ వ్యవహారాలను కాగిత రహిత వ్యవస్థగా రూపుదిద్దడమే లక్ష్యంగా ఆదివారం స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ-పోర్టల్‌ను అఖిలపక్షం భేటీ సందర్భంగా ప్రారంభించారు. ఎంపీలు ఆన్‌లైన్‌లో పరస్పరం సంభాషించుకోవడానికి, వివిధ విభాగాల కార్యదర్శులను ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్ ద్వారా సంప్రదించడానికి ఈ వెబ్‌సైట్ తోడ్పాటునందిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com