సీఎం కేసీఆర్ సంతోషం..

- July 17, 2016 , by Maagulf
సీఎం కేసీఆర్ సంతోషం..

టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో వివిధ అంశాలపై జరుగుతున్న చర్చల్లో పాల్గొనడంపైనా, రాష్ర్టానికి సంబంధించిన అంశాలను పార్లమెంటు వేదికగా కేంద్రం దృష్టికి తీసుకుపోవడంపైనా సీఎం కే చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలను, డిమాండ్లను కూడా మరింతగా గుర్తించి వాటిని కూడా నెరవేర్చుకునే విధంగా పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వైఖరితోపాటు ఇప్పటివరకూ వ్యవహరించిన తీరుపై సమీక్ష జరిగింది. రాష్ట్ర అవసరాల కోసం వివిధ మంత్రిత్వశాఖలకు సంబంధించిన అంశాలను గుర్తించి వాటిపై నిత్యం ఆయా మంత్రిత్వశాఖలను సంప్రదించాలని కేసీఆర్ సూచించారు. ఈ విధంగా రాష్ట్ర అవసరాలను నెరవేర్చుకోడానికి ఎంపీలు సబ్‌గ్రూపులుగా ఏర్పడి మన అవసరాలను తీర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తొలిసారీ ఎంపీలు అయినవారు సీనియర్ల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని పని చేయాలని, ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి పెట్టి పరిణతి పొందాలని కేసీఆర్ సూచించారు. -ప్రతి మెమొరాండం రికార్డు కావాలిమన రాష్ర్టానికి సంబంధించిన సమస్యలపై ఆయా మంత్రిత్వశాఖలతో సంప్రదింపులు జరుపుతూ విజ్ఞాపనపత్రాలు అందజేస్తూ ఉంటారని, ఈ ప్రతులను విధిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపి రికార్డుల్లో భద్రపర్చాలని కూడా కేసీఆర్ ఎంపీలకు సూచించారు. టీఆర్‌ఎస్ ఎంపీల బలం పెరిగినందున పార్లమెంటు నిబంధనల ప్రకారం టీఆర్‌ఎస్‌కు 1200 చ.మీ. విస్తీర్ణం కలిగిన బంగళా పార్టీ కార్యాలయ అవసరాల నిమిత్తం ఢిల్లీలో కేటాయించబడుతుంది కాబట్టి దీనిపై దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com