కువైట్ లో 23కు చేరిన నకిలీ మద్యం మృతుల సంఖ్య..!!
- August 15, 2025
కువైట్: కువైట్ లో నకిలీ మద్యం మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 23మంది మరణించగా, వివిధ ఆస్పత్రులలో 160మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కువైట్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందినవారే ఉన్నారని పేర్కొన్నారు.
నకిలీ మద్యం బాధితుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వారి కోసం 24 గంటలు పనిచేసే ప్రత్యేక ఎమర్జెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నకిలీ మద్యానికి దూరంగా ఉండాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 24 గంటల అత్యవసర హాట్లైన్లు అందుబాటులో ఉన్నాయని, బాధితులు వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. నకిలీ మద్యం బాధితులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది.
మరోవైపు మరణించిన భారతీయుల కోసం ఇండియన్ ఎంబసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే బాధిత డెడ్ బాడీలను భారత్ లోని సొంత ప్రాంతాలకు తరలించేందుకు స్వచ్ఛంధ సంస్థలతో కలిసి పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో గ్రాండ్ దీపావళి గాలా..!!
- MTCIT బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు 3వ ఎడిషన్ ప్రారంభం..!!
- టిటిడిలో అనిల్ కుమార్ సింఘాల్ మార్కుపాలన షురూ!
- భారత్‌లో మెటా అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్ ప్రారంభం
- ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు...
- మెంటల్ హాస్పటల్‌గా రుషికొండ ప్యాలెస్?