రియాద్ లో 84 సంస్థలు మూసివేత..!!

- August 17, 2025 , by Maagulf
రియాద్ లో 84 సంస్థలు మూసివేత..!!

రియాద్ః  రియాద్ మేయరాల్టీ మన్‌ఫుహా పరిసరాల్లో ఇంటెన్సివ్ తనిఖీ ప్రచారాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 84 సంస్థలను మూసివేసింది. అదే సమయంలో మేయాల్టీ 531 నోటీసులను జారీ చేసింది. 11 సైట్లకు విద్యుత్ సరఫరాను డిస్‌కనెక్ట్ చేసింది. 5,322 కిలోల ఆహార పదార్థాలు మరియు 25 కిలోల పొగాకు ఉత్పత్తులను డెస్ట్రాయ్ చేయడంతో పాటు, మానవ వినియోగానికి పనికిరాని 31,620 ఉత్పత్తులను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా మొత్తం పదహారు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.  
ఆహార భద్రత మరియు ఉత్పత్తి నాణ్యతను ప్రభావితం చేసే ఉల్లంఘనలకు సంబంధించి మేరియాల్టీ తన "మాడినాటి" యాప్ లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆహార సంస్థలు, మాంసం షాపులు, కేఫ్‌ తదితర సంస్థలలో తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.  "మాడినాటి" యాప్ ద్వారా ఉల్లంఘనలను నివేదించడం ద్వారా సహకరించాలని పిలుపునిచ్చారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com