దుబాయ్ వీసా ఉన్న వ్యక్తి తన పిల్లలను వేరే ఎమిరేట్‌లో స్కూళ్లో చేర్చవచ్చా?

- August 17, 2025 , by Maagulf
దుబాయ్ వీసా ఉన్న వ్యక్తి తన పిల్లలను వేరే ఎమిరేట్‌లో స్కూళ్లో చేర్చవచ్చా?

యూఏఈ: దుబాయ్ వీసా ఉన్న వ్యక్తి తన పిల్లలను వేరే ఎమిరేట్‌లో స్కూళ్లో చేర్చవచ్చా? ఈ సందేహం సాధరణంగా దుబాయ్ లో ఉద్యోగం కోసం కుటుంబంతో వచ్చే ప్రతి ఒక్కరిలో ఉంటుంది.  అయితే, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) లేదా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ (ICP) నిర్దేశించిన జీతం సాలరీ ఉన్నట్లయితే, మీరు దుబాయ్ జారీ చేసిన నివాస వీసా కలిగి ఉన్నప్పుడు మీ అబ్బాయిని రస్ అల్ ఖైమాలో స్కూళ్లో చేర్చటానికి చట్టబద్ధంగా అనుమతి ఉంటుంది.

సాధరణంగా ఏదైనా ఎమిరేట్‌లో జారీ చేసిన రెసిడెన్సీ వీసాలు యూఏఈలోని ఏడు ఎమిరేట్‌లలో చెల్లుబాటు అవుతాయి. అయితే, స్కూల్ గైడ్ లైన్స్ ప్రకారం.. అవసరమైన సర్టిఫికేట్లు ఉండి, సంబంధిత అధికారుల ఆమోదాలు పొందితే దుబాయ్ వీసా కింద స్పాన్సర్ చేయడానికి వీలవుతుందని యూఏఈకి చెందిన విద్యారంగ నిపుణులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com