డిజిటల్ మీడియాలో పర్యాటక ప్రాంతాల విస్తృత ప్రచారం
- August 18, 2025
అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక, చారిత్రక, వారసత్వ సందకు ప్రతీకగా నిలిచిన ప్రదేశాల వైపు పర్యాటకులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) ప్రత్యేక చర్యలు చేపట్టింది. డిజిటల్ మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ అంతర్జాతీయ పర్యాటకులనూ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేక తలపై వేర్వేరుగా రూపొందించి వీడియోలతో ప్రచారం చేస్తోంది. వీటిని అందరూ లైక్, షేర్ చేసిమన ప్రాంతాల ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పాలని ఏపీటీడీసీ ఒక ప్రకటనలో కోరింది. కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని పెడన కలంకారీ ప్రత్యేకతను వివరిస్తూ రూపొందించిన వీడియోలో సహజ రంగులతో కూడిన అద్దకం, భారతీయ హస్తకళల్లో ప్రాచీన మైన కలంకారీ చిత్రకళను, కళాకారుల నేపుణ్యాన్ని వివరించింది. బాపట్ల జిల్లా లోని భట్రిప్రోలు బౌద్ధస్తూపం నిర్మాణం క్రీ.పూ.3వ శతాబ్దంలో జరిగిందని తెలుగులో లభ్యమైన తొలి శాసనబంగా ఇక్కడి శాసనాలకు పేరుందని మరో వీడియోలో పేర్కొంది. అలనాడు వాణిజ్య, విద్యా కేంద్రంగా విరాజిల్లిన భట్టిప్రోలను సందర్శిం చాలని కోరింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో జాతీయస్థాయిలో పేరున్న మంగళగిరి చేనేత, ఫ్యాబ్రిక్ ఉత్పత్తుల గొప్పతనాన్ని… పానకాల లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ ప్రాశస్త్యాన్ని వీడియోలో వివరించింది. చీరల అల్లిక, నిజాం డిజైన్ బోర్డర్, నాణ్యమైన రంగుల అద్దకం తదితర అంశాలు ఇందులో పొందుపర్చింది.ఆంధ్ర ప్రదేశ్ టూరిజం.
ఇక్కడి చేనేతకు జాతీయస్థాయిలో భౌగోళిక గుర్తింపు (GI) దక్కిందని పేర్కొంది. మానవ కృషి, కళానై పుణ్యం కలిసి తయారయ్యే ఈ చీరలు వస్త్రాలు మాత్రమే కావని, జాపకాలు, భావోద్వేగానికి ప్రతీకలని పేర్కొంది గుంటూరు జిల్లా ఉండల్లి గుహల గొప్పతనం వివరిస్తూ ఉండవల్లిలో ఉల్లితో చెక్కిన గుహలను తప్పక సందర్శిం చాలని పర్యాటకులను మరో వీడి యోలో ఆహ్వానించింది. విజయవాడ సమీపం లోని ఈ ప్రాంతంలో విష్ణుకుండినుల కాలానికి చెందిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆలయాలతో పాటు 20 అడుగుల ఏకశిల అనంత పద్మనాభస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణని పేర్కొంది. జాతీయ ప్రాముఖ్యత కల్గిన కేంద్ర రక్షిత స్మారక కట్టడాల్లో ఒకటని ఏపీటీడీసీ తెలిపింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







