ఖతార్ లో 13 రోజుల పాటు కీలక రోడ్డు మూసివేత..!!

- August 18, 2025 , by Maagulf
ఖతార్ లో 13 రోజుల పాటు కీలక రోడ్డు మూసివేత..!!

దోహా: ఖతార్ లో కీలక రోడ్డు 13 రోజులపాటు మూసివేయనున్నారు. మెయింటనెన్స్  పనుల కారణంగా జాసిమ్ బిన్ థాని బిన్ జాసిమ్ అల్-థాని స్ట్రీట్‌ను రాస్ అల్ నౌఫ్ స్ట్రీట్‌తో కలిపే సిగ్నలైజ్డ్ జంక్షన్ ను మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్ అథారిటీ ప్రకటించింది.

ట్రాఫిక్ ఆంక్షలు ఆగస్టు 18వతేది అర్ధరాత్రి నుండి ఆగస్టు 31వ తేది వరకు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో దోహా వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ రోడ్లకు మళ్లిస్తారు.  జాసిమ్ బిన్ థాని బిన్ జాసిమ్ అల్-థాని స్ట్రీట్, రాస్ అల్ నౌఫ్ స్ట్రీట్ నుండి దోహా వైపు వచ్చే వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పబ్లిక్ వర్క్ అథారిటీ సూచించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com