అనేకమంది ప్రాణాలను కాపాడిన సౌదీ యువకుడి ధైర్యం..!!

- August 19, 2025 , by Maagulf
అనేకమంది ప్రాణాలను కాపాడిన సౌదీ యువకుడి ధైర్యం..!!

రియాద్:  భారీ గ్యాస్ స్టేషన్ పేలుడును నివారించడం ద్వారా సౌదీ యువకుడు అనేక మంది ప్రాణాలను కపాడాడు.  రియాద్ ప్రాంతంలోని అల్-దవాద్మి గవర్నరేట్‌లోని అల్-జంష్ పట్టణంలోని గ్యాస్ స్టేషన్ వద్ద గడ్డి ట్రక్కులో మొదట మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన మహర్ ఫహద్ అల్-దల్బాహి  అసాధారణ ధైర్యసాహసాలతో ట్రక్కు వద్దకు పరుగెత్తి, ఇంధన ట్యాంకుల నుండి దానిని దూరంగా తీసుకెళ్లాడు. దాంతో భారీ భారీ పేలుడును నివారించి, అనేక మంది ప్రాణాలను బలికొనే భారీ విస్పొటనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అతనికి అనేక గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు మహర్ ఫహద్ ధైర్య సహసాలను ప్రశంసిస్తున్నారు. 

కాగా, తన గ్రామం అల్-సాలిహియాకు వెళుతుండగా గ్యాస్ స్టేషన్ సమీపంలోని దుకాణం వద్ద తన కారును ఆపిన సమయంలో ఇదంతా జరిగిందని అల్-దల్బాహి వివరించాడు. ప్రస్తుతం అతను రియాద్‌లోని కింగ్ సౌద్ మెడికల్ సిటీలో ప్రత్యేక వైద్య బృందాల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com