గంటల్లోనే $25 మిలియన్ల విలువైన పిండ్ డైమండ్ రికవరి..!!
- August 19, 2025
దుబాయ్: $25 మిలియన్ల విలువైన విలువైన పింక్ డైమండ్ ను దొంగిలించిన కొన్ని గంటలకే పట్టుకున్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. యూరప్ నుండి ఆభరణాన్ని తీసుకువచ్చిన వజ్ర వ్యాపారిని నిందితులు బురిడీ కొట్టించారని, దానిని కొనుగోలు చేసే నెపంతో నేరస్థుల ముఠా అతడిని విల్లాకు ఆహ్వానించారని పోలీసులు తెలిపారు. అక్కడికి రాగానే పింక్ డైమండ్ ను ముఠా సభ్యులు చోరీ చేసి పరారు అయ్యారని అన్నారు. చోరీ జరిగిన ఎనిమిది గంటల్లోపే సీసీ ఫుటేజీలను పరిశీలిచడం ద్వారా ముగ్గురు వ్యక్తులను ట్రేస్ చేసి అరెస్టు చేసి, అరుదైన పింక్ డైమండ్ ను రికవరి చేసినట్టు దుబాయ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!