365 రోజుల మెట్రోపాస్‌ను ఆవిష్కరించనున్న ఖతార్ రైలు..!!

- August 20, 2025 , by Maagulf
365 రోజుల మెట్రోపాస్‌ను ఆవిష్కరించనున్న ఖతార్ రైలు..!!

దోహా: దోహా మెట్రోలోని స్పోర్ట్ సిటీ స్టేషన్‌లో బ్యాక్ టు స్కూల్ ఈవెంట్ సందర్భంగా ఖతార్ రైలు, కొత్త 365 రోజుల మెట్రోపాస్‌ను ప్రారంభించనుంది. 990 ఖతార్ రియాల్స్ ధరతో, ఈ పాస్ దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ నెట్‌వర్క్‌లో అపరిమిత రైడ్స్ పొందవచ్చు.

ఖతార్ రైల్ సెప్టెంబర్ 2వరకు దోహా మెట్రో స్పోర్ట్ సిటీ స్టేషన్‌లో "బ్యాక్ టు స్కూల్" ఈవెంట్ రెండవ ఎడిషన్‌ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సందర్శకులకు ప్రత్యేకమైన ఎర్లీ బర్డ్ ప్రమోషన్‌ను అందిస్తుంది.  దీని ద్వారా వారు 20% తగ్గింపుతో మెట్రో పాస్‌ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 31వరకు ఈవెంట్‌లో ఎర్లీ బర్డ్ వోచర్‌లను ప్రత్యేకంగా పొందవచ్చు.  వాటిని సెప్టెంబర్ 30 మధ్య ఏదైనా దోహా మెట్రో గోల్డ్ క్లబ్ కార్యాలయం లేదా లుసైల్ ట్రామ్ టికెటింగ్ కార్యాలయంలో కొనుగోలు సమయంలో అవసరమైన అసలు వోచర్‌తో రీడీమ్ చేసుకోవచ్చు.

మెట్రో గోల్డ్ లైన్‌లోని స్పోర్ట్ సిటీ స్టేషన్‌లో ఈ ఈవెంట్ వారాంతపు రోజులలో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, వారాంతాల్లో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నారు. పిల్లలు, ఫ్యామిలీ కోసం ఇంటరాక్టివ్ గేమింగ్ జోన్, పెయింటింగ్, కలరింగ్ మరియు ఆర్ట్ అనుభవాలు, వివిధ పోటీలలో విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాలను అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com