BIC ఆధ్వర్యంలో ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్..!!
- August 20, 2025
మనామా: ‘ది హోమ్ ఆఫ్ మోటార్‌స్పోర్ట్ ఇన్ ది మిడిల్ ఈస్ట్’ గా గుర్తింపు పొందిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC), ఈ సంవత్సరం చివర్లో సుప్రీం కౌన్సిల్ ఫర్ ఉమెన్ సహకారంతో ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రపంచ స్థాయి మోటార్‌స్పోర్ట్ సౌకర్యంపై మహిళలకు అవగాహన కల్పించనున్నారు.
ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ ప్రగ్రామ్స్ కు ‘డైవర్స్ డ్రైవ్ 2’ అని పేరు పెట్టారు. ఈ రెండవ ఎడిషన్‌ను మూడు నెలలకు బదులుగా ఆరు నెలల వ్యవధికి పొడిగించారు. ఇది ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రారంభమై ఫిబ్రవరిలో ముగుస్తుంది.
ఇంజనీరింగ్‌లో మెకానికల్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్, సివిల్ లేదా సంబంధిత రంగాలలో తాజా గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటించారు. తమ కెరీర్ ను హై గేర్‌లోకి మార్చడానికి సిద్ధంగా ఉన్నవారితోపాటు కార్యక్రమంలో భాగం కావడానికి ఆసక్తి ఉన్న వారందరూ HYPERLINK "https://www.bahraingp.com/careers-in-bic/" https://www.bahraingp.com/careers-in-bic/ ని సందర్శించడం ద్వారా లేదా bahraingp.com ని సందర్శించడం ద్వారా తమ ఆసక్తిని నమోదు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!