ఖతార్ లో జన్యు-ఆధారిత న్యూబర్న్ స్క్రీనింగ్ ప్రారంభం..!!
- August 20, 2025
దోహా, ఖతార్: సిద్రా మెడిసిన్, రాడి చిల్డ్రన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ జెనోమిక్ మెడిసిన్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు జన్యు-ఆధారిత నవజాత శిశువు స్క్రీనింగ్ పరిశోధన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఖతార్ ఫౌండేషన్ వెల్లడించింది. సిద్రా మెడిసిన్ బిగిన్ఎన్జిఎస్ కన్సార్టియంలో చేరిన మొదటి అంతర్జాతీయ సైట్ ఇదని, ఇది జన్యు సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి, నివారించేందుకు దోహదం చస్తుందన్నారు.
మోనోజెనిక్, టైప్ 1 డయాబెటిస్తో సహా అనేక రకాల అరుదైన, సంక్లిష్ట వ్యాధులకు జన్యు ఔషధాన్ని అమలు చేయడానికి సిద్రా మెడిసిన్ పరిశోధన వ్యూహంలో ఈ ఒప్పందం భాగమని సిద్రా మెడిసిన్లో చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ ప్రొఫెసర్ ఖలీద్ ఫఖ్రో, సిద్రా మెడిసిన్లో లీడ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ అమ్మిరా అకిల్ వెల్లడించారు.
మొట్టమొదటి సారిగా విస్తృత స్థాయిలో నవజాత శిశువుల జీనోమ్ స్క్రీనింగ్ పరిశోధనను నిర్వహించనున్నట్టు అధ్యాపకులు తెలిపారు. బిగిన్ఎన్జిఎస్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లోని పలు ఆసుపత్రులలో 511 పల్లలలో జన్యు వ్యాధులను గుర్తించింది. 2030 నాటికి 10 దేశాలలో 1,000 వ్యాధులకు బిగిన్ఎన్జిఎస్ను అమలు చేయడమే లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..