జూలైలో అబ్షర్ ద్వారా 43 మిలియన్లకు పైగా ఇ-లావాదేవీలు..!!
- August 20, 2025
రియాద్: సౌదీ అరేబియాలో ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అబ్షర్ జూలై నెలకు సంబంధించి ఇ-లావాదేవీలలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. జూలైలో అబ్షర్ ద్వారా 43 మిలియన్లకు పైగా ఇ-లావాదేవీలు జరిగాయని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అదే సమయంలో అబ్షర్ ఇండివిజువల్స్ ప్లాట్ఫామ్ ద్వారా చేపట్టిన లావాదేవీల సంఖ్య 40,650,713 కు చేరుకుంది. డిజిటల్ వాలెట్ ద్వారా 33,387,591 డాక్యుమెంట్ సమీక్షలు నిర్వహించారు. అబ్షర్ బిజినెస్ ప్లాట్ఫామ్ ద్వారా పూర్తయిన లావాదేవీల సంఖ్య 2,788,493 కు చేరుకుంది.
అబ్షర్ ప్లాట్ఫామ్ ద్వారా ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఏకీకృత డిజిటల్ గుర్తింపుల సంఖ్య 28 మిలియన్లను దాటింది. నేషనల్ యూనిఫైడ్ యాక్సెస్ పోర్టల్ నఫాత్ ద్వారా 500 కంటే ఎక్కువ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను యాక్సెస్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







