మహిళా కమిషన్ సభ్యులుగా పీవీ సింధు, మహేశ్‌భగవత్
- August 21, 2025
హైదరాబాద్: జాతీయ మహిళా కమిషన్ (NCW) సలహా కమిటీ-2025 సభ్యులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ మహేశ్ భగవత్‌లు నియమితులయ్యారు.ఈ నియామకానికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల అయింది.మహిళల సంక్షేమం, భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై కమిషన్‌కు సలహాలు, సూచనలు ఇవ్వడం ఈ సలహా కమిటీ ప్రధాన విధి. పీవీ సింధు క్రీడాకారిణిగా ఆమె దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చారు. ఆమె మహిళా సాధికారతకు ఒక చిహ్నంగా నిలిచారు. మహేశ్ భగవత్ ఐపీఎస్ అధికారిగా, తెలంగాణలో మహిళల భద్రత కోసం, ముఖ్యంగా మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ఆయన చేసిన కృషికి గాను విశేష గుర్తింపు పొందారు. వీరి నియామకం వల్ల మహిళా కమిషన్‌కు వారి అనుభవం, నిపుణత ఎంతగానో ఉపయోగపడతాయని కమిషన్ భావిస్తోంది. మహిళా కమిషన్ ఛైర్పర్సన్ విజయా కిశోర్ రహాట్కర్ ఆధ్వర్యంలో నడిచే ఈ కమిటీలో మొత్తం 21 మందిని సభ్యులుగా నియమించారు. ఇందులో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి, ఫిక్కి ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్‌కూ ఇందులో స్థానం కల్పించారు.
తాజా వార్తలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..
- ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..
- తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!







