'విశ్వంభర' మెగా బ్లాస్ట్ గ్లింప్స్ రిలీజ్
- August 21, 2025
రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర టీమ్ అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సోషల్-ఫాంటసీ స్పెక్టకిల్కు సంబంధించిన గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు.వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రం, వంశీ, ప్రమోద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.ఈ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ ఎపిక్ టోన్ సెట్ చేసింది.
ఓ బాబు, పెద్దాయన మధ్య జరిగే సంభాషణతో గ్లింప్స్ మొదలౌతుంది. విశ్వంభరలో జరిగిన పరిణామాల గురించి ఆ పెద్దాయన చెబుతాడు. ఒకరికి వచ్చిన స్వార్థం కారణంగా జరిగిన యుద్ధం… సమూహం ఎదురుచూసే రక్షకుడు ఎంట్రీ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది.
చిరంజీవి మాస్ లుక్‌లో, రక్షకుడిగా ఇచ్చిన పవర్ఫుల్ ఎంట్రీ గూస్బంప్స్ తెప్పించింది. వశిష్ట విజన్‌తో క్రియేట్ చేసిన ఈ యూనివర్స్ అద్భుతమైన గ్రాండియర్‌తో అదిరిపోయింది
ప్రొడక్షన్ డిజైనర్ AS ప్రకాశ్ విశ్వంభర యూనివర్స్‌ని అద్భుతంగా తీర్చిదిద్దగా, సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు ఫ్రేమ్‌లతో మ్యాజిక్ క్రియేట్ చేశారు.ఎం.ఎం.కీరవాణి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంపాక్ట్ రెట్టింపు చేసింది.విజువల్స్, VFX హాలీవుడ్ రేంజ్లో ఉండగా, యూవీ క్రియేషన్స్ హై ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతీ షాట్లో అద్భుతంగా కనిపించాయి.
చిరంజీవి కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయి కాబోతుందని గ్లింప్స్ ప్రామిస్ చేస్తోంది.ఈ గ్లింప్స్ మెగాస్టార్ పర్ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్ గా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, అశికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే ప్రకటించినట్లుగా విశ్వంభర 2026 సమ్మర్ బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, ప్రత్యేక పాటలో మౌని రాయ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి, భీమ్స్ సిసిరోలియో
DOP: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..