బహ్రెయిన్-ఈజిప్ట్ రక్షణ సహకారం బలోపేతం..!!

- August 22, 2025 , by Maagulf
బహ్రెయిన్-ఈజిప్ట్ రక్షణ సహకారం బలోపేతం..!!

మనామా: ఈజిప్ట్‌లోని కైరోలో బహ్రెయిన్-ఈజిప్ట్ జాయింట్ మిలిటరీ కోఆపరేషన్ కమిటీ 22వ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ ఆపరేషన్స్ అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ ఘనేమ్ ఇబ్రహీం అల్-ఫదాలా మరియు ఈజిప్షియన్ సాయుధ దళాల ప్లానింగ్ డైరెక్టర్ మేజర్ జనరల్ అహ్మద్ మొహమ్మద్ ఒమర్ పాల్గొన్నారు. ఈ సమావేశాలు ఆగస్టు 17 నుండి 21 వరకు జరిగాయి.

ఈ సమావేశంలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ మరియు ఈజిప్షియన్ సాయుధ దళాల మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా అనేక కీలక అంశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. రాబోయే రోజుల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com