పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే..15 రోజులపాటు మూసివేత..!!
- August 22, 2025
దోహా: ఖతార్ లో నిబంధనల ప్రకారం వాణిజ్య సముదాయాలు, సంస్థలు పనిచేయాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) తేల్చిచెప్పింది. నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని పేర్కొంది. పాదచారులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం, నిబంధనలను పాటించకపోవడం వంటి చర్యలకు పాల్పడితే.. ఖతార్ లో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం..ఆయా సంస్థలను 15 రోజులపాటు మూసివేయడంతోపాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్ లో వెల్లడించింది.
మరోవైపు ఖతార్ వ్యాప్తంగా ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించని అనెక రెస్టారెంట్లతోపాటు పలు ఫుడ్ ఆధారిత కంపెనీలను మూసివేయించారు. ప్రజారోగ్యానికి , వినియోగదారుల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిగణించబడుతున్న పద్ధతులను సహించమని స్పష్టం చేసింది. 16001లో హాట్‌లైన్‌ను సంప్రదించడం ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం లేదా మంత్రిత్వశాఖ అప్లికేషన్‌ను ద్వారా ఫిర్యాదులు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!