‘మదరాసి’ ఆగస్టు 24న ట్రైలర్ & ఆడియో లాంచ్
- August 23, 2025
శివకార్తికేయన్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మదరాసి’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్, చార్ట్ టాపింగ్ ఫస్ట్ సింగిల్ సెలవికాతో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు టీం ఎక్సయిట్మెంట్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఆగస్టు 24న జరగనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆయనకు క్రూషియల్ కమ్ బ్యాక్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఇందులో శివకార్తికేయన్‌ని ఫుల్ మాస్, ఫియర్స్ లుక్‌లో చూపించనున్నారు.
ట్రైలర్ పోస్టర్లో శివకార్తికేయన్‌తో పాటు విద్యూత్ జమ్మ్వాల్, బిజు మెనన్, విక్రాంత్‌లను కూడా ఇంటెన్స్ లుక్‌లో ప్రజెంట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సెలవికా, లవ్ ఫెయిల్యూర్ ఆంథమ్‌గా మారి మంచి హిట్ సాధించింది.
రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె ప్రెజెన్స్ కమర్షియల్ స్పేస్‌కి కొత్తదనం తీసుకురానుంది.
శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాను గ్రాండ్ స్కేల్లో నిర్మిస్తున్నారు. ఇందులో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా ఉండబోతోంది. సినిమాటోగ్రఫీని సుదీప్ ఎలామోన్ హ్యాండిల్ చేస్తున్నారు.
రెండు రోజుల్లో ట్రైలర్, ఆడియో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ‘మదరాసి’పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేట్రికల్ రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!