దుబాయ్ లో ఇద్దరు వరల్డ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్ట్..!!
- August 23, 2025
యూఏఈ: ఫ్రాన్స్ మరియు బెల్జియంకు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను ఆయా దేశాల అధికారులకు అప్పగించినట్లు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్) వారిపై జారీ చేసిన రెడ్ నోటీసుల ఆధారంగా దుబాయ్ పోలీసులు ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను అరెస్టు చేశారని తెలిపింది.
వారిలో ఒకరు అనేక యూరోపియన్ దేశాలలో పనిచేస్తున్న వ్యవస్థీకృత క్రిమినల్ నెట్‌వర్క్‌లో భాగమని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో కీలక వ్యక్తి అని తెలిపింది. అతడిపై ఫ్రాన్స్ తదితర యూరోపియన్ దేశాలలో అనేక కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది .
మరొక వ్యక్తి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి బెల్జియంలో పనిచేస్తున్న ఒక క్రిమినల్ ముఠా సభ్యుడని, బెల్జియం మోస్ట్ వాంటెడ్ వ్యక్తులలో అతడు ఒకడని యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!