తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ.. సోషల్ మీడియాలో క్యూట్ పోస్ట్
- August 25, 2025
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra) గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లికాబోతున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటిచారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టారు. “మా చిన్ని ప్రపంచం.. త్వరలో మా జీవితాల్లోకి రాబోతోంది’ అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు 1+1 = 3 అని రాసి ఉన్న ఫోటోను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో పరిణీతి అభిమానులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2023 సెప్టెంబర్ 24వ తేదీన ఉదయ్‌పుర్ లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా చెల్లెలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు పప్రియాంక చోప్రా. 2011లో విడుదలైన ‘లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్’ సినిమా పరిణీతి చోప్రా మొదటి సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస సినిమాలు చేశారు పరిణితి చోప్రా.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్