టైప్ 1 డయాబెటిస్..'ట్జియెల్డ్' నమోదుకు SFDA ఆమోదం..!!

- August 25, 2025 , by Maagulf
టైప్ 1 డయాబెటిస్..\'ట్జియెల్డ్\' నమోదుకు SFDA ఆమోదం..!!

రియాద్: 8 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు, పిల్లల రోగులలో స్టేజ్ 3 టైప్ 1 డయాబెటిస్ రాకుండా ఆలస్యం చేయడానికి సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ట్జియెల్డ్ (టెప్లిజుమాబ్) నమోదుకు ఆమోదం తెలిపింది.

ఇది T లింఫోసైట్‌లపై సెల్ ఉపరితల యాంటిజెన్ అయిన CD3ని లక్ష్యంగా చేసుకునే మోనోక్లోనల్ యాంటీబాడీ అని, ఇది కణాలకు బంధించడం ద్వారా, ఉత్పత్తి వాటి కార్యకలాపాలను నిరోధించడానికి లేదా వాటి సంఖ్యను తగ్గించడానికి సహాయపడుతుందన్నారు. ఇది రోగనిరోధక సమతుల్యతను పునరుద్ధరించడంలో.. వ్యాధి పురోగతిని ఆలస్యం చేయడంలో సహాయపడుతుందన్నారు.

ప్లేసిబోతో పోలిస్తే Tzield రోగ నిర్ధారణకు సగటు సమయం 24.6 నెలలు పొడిగించినట్టు ట్రయల్ ఫలితాలు నిర్ధాయించాయి. క్లినికల్ అధ్యయనాలలో ఎక్కువగా లింఫోపెనియా, దద్దుర్లు, ల్యూకోపెనియా , తలనొప్పి వంటి సమస్యలు తలెత్తినట్లు తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com