మస్కట్ లో థాయిలాండ్ ఫెస్టివల్..ప్రవేశం ఉచితం..!!
- August 27, 2025
మస్కట్: ఆగస్టు 28 నుండి 30 మస్కట్ వేదికగా థాయిలాండ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆట్రియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.దీనికి థాయిలాండ్ టూరిజం అథారిటీ, థాయ్ ట్రేడ్ ఆఫీస్, థాయ్ కంపెనీలు మద్దతు ఇస్తున్నాయి. ఒమన్‌లోని థాయ్ కమ్యూనిటీ సహకారంతో మస్కట్‌లోని థాయ్ రాయబార కార్యాలయం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
అందరికి ప్రవేశం ఉచితం. “ది గిఫ్ట్,” “అండర్ ది వింగ్స్ ఆఫ్ డ్రీమ్స్,” మరియు “లెటర్ ఫ్రమ్ ది సన్,” అలాగే బర్నెట్ థాయిలాండ్ చేసిన థాయ్ సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వీటిలో “సౌండ్ ఆఫ్ లన్నా,” “బ్యాంకాక్ జాయ్,” “సదరన్ బ్రీజ్,” “అమేజింగ్ థాయిలాండ్,” “క్యాండిల్‌లైట్ ఇన్ చియాంగ్ మై,” “ఫ్లేవర్స్ ఆఫ్ ఇసాన్,” “పింక్ లోటస్,” “లోయ్ క్రా థాంగ్ సుఖోథాయ్,” మరియు “సాంగ్‌క్రాన్ వాటర్ ఫెస్టివల్” వంటి తొమ్మిది ప్రదర్శనలు ప్రత్యేకంగా ఉంటాయని వెల్లడించారు.
ఈ థాయ్ ఫెస్టివల్ ఆగస్టు 28 (గురువారం) మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 10:00 గంటల వరకు ఉంటుందన్నారు. ఇక ఆగస్టు 29 మరియు 30వ తేదీల్లో మధ్యాహ్నం 2:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు ఉంటుందని ప్రకటించారు.
వీటితోపాటు ప్యాడ్ థాయ్, టామ్ యమ్ కుంగ్, సోమ్ టామ్ మరియు అనేక ఇతర థాయ్ వంటకాలతో పాటు రుచికరమైన థాయ్ ఐస్ క్రీం, డ్రై ఫ్రూట్స్ మరియు డెజర్ట్‌లు వంటి ప్రసిద్ధ ప్రామాణికమైన థాయ్ ఫుట్ స్టాల్స్ ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు