GCC జాతీయులను వివాహం చేసుకున్న బహ్రెయిన్ మహిళలకు భత్యం..!!

- August 27, 2025 , by Maagulf
GCC జాతీయులను వివాహం చేసుకున్న బహ్రెయిన్ మహిళలకు భత్యం..!!

మానామా: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల పౌరులను వివాహం చేసుకున్న బహ్రెయిన్ మహిళలకు జీవన వ్యయ భత్యాన్ని విస్తరించే ప్రతిపాదనను బహ్రెయిన్ ఎంపీ జలాల్ కజెం అల్-మహ్ఫౌద్ సమర్పించారు.  అయితే, వారు బహ్రెయిన్‌లో శాశ్వతంగా నివసించాలని కండిషన్ విధించారు. ఈ మహిళలకు ఇతర బహ్రెయిన్ పౌరుల మాదిరిగానే మద్దతును అందించడం సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడం వంటిదని అని అన్నారు.

పెరుగుతున్న జీవన వ్యయాలు మరియు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న అనేక బహ్రెయిన్ కుటుంబాలను గమనించిన తర్వాత ఈ ప్రతిపాదన చేసినట్లు అల్-మహ్ఫౌద్ వివరించారు. GCC జాతీయులను వివాహం చేసుకున్న బహ్రెయిన్ మహిళలు ఇతర పౌరుల మాదిరిగానే తమ మాతృభూమితో కలిసి ఉండేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు.  జీవన వ్యయ భత్యం కార్యక్రమంలో ఈ మహిళలను చేర్చడం సామాజిక రక్షణను బలోపేతం చేయడానికి, ప్రభుత్వ మద్దతు కార్యక్రమాల నుండి పౌరులందరూ ప్రయోజనం పొందేలా చూసుకోవడానికి సానుకూల అడుగు అవుతుందని అల్-మహ్ఫౌద్ అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com