ఏడేళ్ల తర్వాత చైనాలో ప్రధాని మోదీ..
- August 30, 2025
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లారు. శనివారం ఆయన చైనాలో అడుగుపెట్టారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) వార్షిక్ సమ్మిట్ లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. టియాన్ జిన్ లో రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ ఉంటుంది.
ఆదివారం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. భారత్ పై అమెరికా విధించిన టారిఫ్ ల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అటు చైనాతోనూ ట్రంప్ వివాదం పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో వీరి భేటీ ఆసక్తికరగా మారింది.
2020లో చోటు చేసుకున్న గల్వాన్ ఘర్షణ, ఈస్ట్రన్ లడఖ్ లో సైనిక ప్రతిష్టంభనతో భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజా భేటీలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
భారత్ చైనా సంబంధాలు చాలా కీలకం..
జపాన్ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్-చైనా సంబంధాలు చాలా కీలకమైనవని చెప్పారు. రెండు దేశాల మధ్య శాంతి, శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
“చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు, నేను ఇక్కడి నుండి టియాంజిన్‌కు వెళ్లి SCO శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటాను. గత సంవత్సరం కజాన్‌లో (రష్యాలో జరిగిన SCO సమావేశంలో) అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశం అయ్యాను. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో స్థిరమైన, సానుకూల పురోగతి సాధించాము” అని మోదీ అన్నారు.
“ఈ భూమిపై భారత్, చైనా రెండు అతిపెద్ద దేశాలు. ఇరు దేశాల మధ్య స్థిరమైన, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలు.. ప్రాంతీయ, ప్రపంచ శాంతి శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది ఆసియాతో పాటు పంచానికి కూడా చాలా కీలకం” అని మోదీ అన్నారు.
ఈ నెల ప్రారంభంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్ లో పర్యటించారు. సరిహద్దు సమస్య పరిష్కారానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీని తిరిగి ప్రారంభించడానికి, అలాగే వీసాల సౌకర్యాన్ని కల్పించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.
ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ట్రంప్ సుంకాల ప్రభావం, యుక్రెయిన్‌తో రష్యా వివాదం, గాజాలో పరిస్థితిపై మోదీ, పుతిన్ లు చర్చించే అవకాశం ఉంది.
భారత్ పై ట్రంప్ విధించిన సుంకాలపై వాషింగ్టన్ నిపుణులు తీవ్రంగా స్పందించారు. భారత్, అమెరికా మధ్య అనేక రంగాలలో పెరుగుతున్న సహకారాన్ని ఈ టారిఫ్ లు తీవ్రంగా దెబ్బతీశాయని ఆందోళన వ్యక్తం చేశారు. అటు.. ట్రంప్ టారిఫ్స్ తర్వాత భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య పరంగా మాస్కో, బీజింగ్ లతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలని చూస్తోంది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్ పై ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ చర్య.. బీజింగ్, మాస్కో రెండింటికీ భారత్ దగ్గరయ్యేందుకు దారితీసింది. ఆ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం మెరుగుపరుచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్