సౌదీ కస్టమ్స్ పోర్టులలో నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- August 31, 2025
రియాద్: సౌదీ అరేబియా అంతటా కస్టమ్స్ పోర్టులలోని జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. గత వారం రోజుల్లో 1,371 నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులలో 333 నిషేధిత పదార్థాలతో పాటు హషీష్, కొకైన్, హెరాయిన్, షాబు మరియు కాప్టాగన్ మాత్రలు సహా 47 రకాల మాదకద్రవ్యాలు ఉన్నాయి. కస్టమ్స్ పోర్టులలో 1,046 పొగాకు ఉత్పత్తులు, 15 రకాల నగదు మరియు మూడు రకాల ఆయుధాలు కూడా ఉన్నాయని తెలిపారు.
సమాజ భద్రత, రక్షణకు దిగుమతులు మరియు ఎగుమతులపై కస్టమ్స్ నియంత్రణను కఠినతరం చేయనున్నట్లు అథారిటీ స్పష్టం చేసింది. 1910 నంబర్ లేదా ఇమెయిల్ లేదా అంతర్జాతీయ నంబర్ 009661910 ద్వారా స్మగ్లింగ్ కు సంబంధించి సమాచారాన్ని తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా పెడతామని, అర్హులైన వారికి నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!