ట్రంప్ హెల్త్ పై సంచలనం.. అమెరికా డాక్టర్ చెప్పిన కీలక విషయాలు..

- August 31, 2025 , by Maagulf
ట్రంప్ హెల్త్ పై సంచలనం.. అమెరికా డాక్టర్ చెప్పిన కీలక విషయాలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యం గురించి వదంతులు వ్యాపిస్తున్నాయి. ట్రంప్ చేతి మీద మచ్చ కనిపిస్తోంది. కాళ్లలో వాపు కనిపిస్తోంది. మనిషి కూడా అంత యాక్టివ్ గా లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ 24 గంటల పాటు జనాలకు కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం గురించి మరింత పుకార్లు వెల్లువెత్తాయి. ఏకంగా ‘ట్రంప్ డెడ్’ అనే వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

అయితే, ఈ వార్తల మధ్యలో ట్రంప్ తన మనవడు, మనవరాలితో కలసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. వైట్‌హౌస్‌ సౌత్‌బ్లాక్‌లో తన మనవళ్లతో ఆడుకుంటున్న ట్రంప్ ఫొటోలు కనిపించాయి. దీంతో కొంత రూమర్లకు తెరపడింది. కానీ, ఆ ఫొటోలు ఎప్పటివి అనే అంశం తెరపైకి వచ్చింది.

ఇక ట్రంప్‌కి ఉన్న అనారోగ్య సమస్య ఏంటనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ట్రంప్‌కి ఉన్న సమస్య క్రిటికల్ వెనస్ ఇన్ ఎఫిషియన్సీ (సిరలు దెబ్బతినడం). దీన్ని మెడికల్ పరిభాషలో CVI అంటారు. దీనిపై అమెరికన్ డాక్టర్ మిమీ కాంగ్ స్పందించారు. ఓ హెల్త్ సెంటర్ బ్లాగ్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు.

‘సీవీఐ అనేది కామన్ గా ఉంటుంది. అమెరికాలో ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇలాంటి సమస్య ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది చిన్న సమస్యగా ఉంటుంది. అదే టైమ్‌లో తీవ్రంగానూ ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఏంటంటే.. కాళ్లలో వాపు వస్తుంది. వాపు పెద్దదైతే తోలు మందం అవుతుంది. మంటలు పుడతాయి. చర్మం పొడిబారిపోతుంది. పరిస్థితి ఇంకా దిగజారితే అప్పుడు కాళ్లో మానని గాయాలు ఏర్పడతాయి. ఇంకా ఇంకా పరిస్థితి దిగజారితే మాత్రం ఆ కాలు లేదా చెయ్యి తీసేయాల్సి వస్తుంది.’ అని డాక్టర్ చెప్పారు.

మరోవైపు ఇదేమంత పెద్ద సమస్య కాదన్నట్టు వైట్ హౌస్ ప్రకటిస్తోంది. ప్రతి రోజూ ప్రతి వ్యక్తితో ట్రంప్ షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఒత్తిడిపడిందని.. లోపల పెద్ద సమస్య లేదని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com