వార్-2 ఎఫెక్ట్‌తో ఎన్టీఆర్-నీల్ డ్రాగన్ మూవీ స్ర్కిప్ట్ ఛేంజ్?!
- August 31, 2025
జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం డ్రాగన్ పై ఇంట్రెస్టింగ్ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే ప్రారంభమైంది. కానీ స్క్రిప్ట్‌లో ఊహించని మార్పులు జరుగుతున్నాయని టాక్. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్బస్టర్లతో తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ నీల్..ఈ పిక్చర్‌ను భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ఫలితం, ఈ ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేయాలని ఎన్టీఆర్ సూచించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వార్ 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదని, దీని ప్రభావం ఎన్టీఆర్‌పై పడినట్లు చెబుతున్నారు. వార్-2లో ఎన్టీఆర్ విలన్‌గా కనిపించినా, అతని పాత్రకు మంచి గుర్తింపు లభించినప్పటికీ, సినిమా మొత్తం మీద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
వార్-2 తర్వాత పబ్లిక్ టాక్, ఆడియన్స్ రెస్పాన్స్‌ను బట్టి నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో కేర్ తీసుకుంటున్నారట ఎన్టీఆర్. ముఖ్యంగా తన మాస్ ఇమేజ్ను పెంచుకునేలా మూవీస్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. డ్రాగన్ సినిమా స్క్రిప్ట్‌లో ఎన్టీఆర్ కొన్ని సూచనలు చేసినట్లు, తన పాత్రను మరింత స్ట్రాంగ్‌గా, ప్రేక్షకులకు ఆకట్టుకునేలా మార్చాలని ప్రశాంత్ నీల్‌ను కోరినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
స్క్రిప్ట్‌లో చేంజెస్‌తో డ్రాగన్ మూవీని సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ కావడంతో పాటు, పాన్-ఇండియా స్థాయి స్టార్‌డమ్‌ను ఇంకా పెంచుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నారని టాక్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సజీషన్స్ను పాజిటివ్‌గా తీసుకుని, సినిమాను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు స్క్రిప్ట్‌లో చేంజెస్ చేస్తున్నారట. ఈ మార్పులు సినిమా కథను ఎలా ప్రభావితం చేస్తాయో.? చూడాలి మరి.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్