మురుగదాస్ డైరెక్షన్ లో నటించడం ఆనందంగా ఉంది: హీరో శివకార్తికేయన్
- September 01, 2025
శివకార్తికేయన్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మదరాసి', ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ...అందరికీ నమస్కారం.మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది.ఇది ఎ.ఆర్.మురుగదాస్ సినిమా. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టార్స్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మురుగదాస్. ఆయనతో కలిసి వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.సాలిడ్ ఫిల్మ్ ఇచ్చారు.ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నా ప్రాణ స్నేహితుడు రాక్ స్టార్ అనిరుద్. అనిరుద్ అంటే హిట్ మిషన్. ఆయన ఇచ్చే పాటలన్నీ హిట్. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ తిరుపతి ప్రసాద్.చాలా సింపుల్ పర్సన్. చాలా పెద్ద సినిమా తీశారు. కంటెంట్ ఉంటే ఎంతైనా ఖర్చు చేస్తారు,.ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. అందుకే తెలుగు సినిమాలు తరచుగా వెయ్యి కోట్లకు వెళ్తుంటాయి.ఈ సినిమాలో రుక్మిణి హీరోయిన్. చాలా టాలెంటెడ్.ఈ సినిమాలో లవ్ యాక్షన్ రెండు పిల్లర్స్. అందులో లవ్ పోర్షన్ అద్భుతంగా రావడానికి కారణం తనే. ఈ సినిమాలో మరో పిల్లర్ విలన్ విద్యుత్ జమ్వాల్. ఆయనతో చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా క్రేజీగా ఉంటాయి .అందరూ సెప్టెంబర్ 5 థియేటర్స్ కి వెళ్లి మద్రాసి చూడండి. ఎంజాయ్ చేయండి. ఇప్పటివరకు నా సినిమాలు రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, మహావీరుడు, అమరన్ కు మంచి సపోర్ట్ ఇచ్చారు. పెద్ద గుర్తింపు ఇచ్చారు.ఈ సినిమాకి కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సక్సెస్ కంటే మీరు చూపించే ప్రేమే నాకు చాలా స్పెషల్. మీరందరూ మరింత ప్రేమిస్తారని కోరుకుంటున్నాను. మదరాసి తప్పకుండా చూడండి. అద్భుతమైన కథ, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి.టీం అందరం చాలా హార్డ్ వర్క్ చేశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. లవ్ యు ఆల్.
హీరోయిన్ రుక్మిణి వసంత్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.మదరాసి మా టీమ్ అందరికీ చాలా స్పెషల్ సినిమా. సెప్టెంబర్5 తర్వాత మీ అందరికీ కూడా ఫేవరెట్ సినిమా అవుతుంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్.ఒక అద్భుతమైన టీం తో కలిసి పని చేశాను. శివ కార్తికేయన్ ఎక్స్ట్రార్డినరీ, ప్రొడ్యూసర్ ప్రసాద్ చాలా సపోర్ట్ చేశారు. అందరు కూడా సెప్టెంబర్ 5 తప్పకుండా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. యాక్షన్ లవ్ అన్ని ఎమోషన్స్ ఉన్న అద్భుతమైన ఎంటర్టైనర్ ఇది. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. మేము తమిళ్ నుంచి తెలుగుకి సినిమాలు తీసుకొస్తుంటాం.ఫస్ట్ టైం డైరెక్టర్ మురుగదాస్ గారి వలన తమిళ్లో చేశాం. శివ కార్తికేయన్ ఈ సినిమాలో హీరో కావడం మా అదృష్టం. అమరన్ తర్వాత వస్తున్న ఈ సినిమాని ఎక్కడ రాజీ పడకుండా చాలా ప్రతిష్టాత్మకంగా తీశాం. శివ నిజాయితీపరుడు. కష్టపడి పైకి వచ్చాడు. ఈ సినిమాలో విద్యుత్, బిజుమినన్, రుక్మిణి వర్షన్ ఇలా అద్భుతమైన నటీనటులు వున్నారు. అనిరుద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. టాప్ టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకు పని చేశారు. సినిమా విజువల్ వండర్ గా ఉంటుంది. శివ కార్తికేయన్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది.
బీస్ట్‌బెల్స్ ఉదయ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.నాకు ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు ప్రసాద్ గారికి ధన్యవాదాలు.ఈ సినిమాకి ప్రైమరీ కంపెనీగా చాలా వర్క్ చేసాం.ఇంత గ్రాండియర్ సినిమా మేము చేసినందుకు చాలా గర్వంగా ఉంది.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్