క్రౌన్ ప్రిన్స్ తో పాలస్తీనా ఉపాధ్యక్షుడు చర్చలు..!!

- September 02, 2025 , by Maagulf
క్రౌన్ ప్రిన్స్ తో పాలస్తీనా ఉపాధ్యక్షుడు చర్చలు..!!

రియాద్: రియాద్‌లోని అల్-యమామా క్రౌన్ ప్రిన్స్,  ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ తో ప్యాలెస్‌లో పాలస్తీనా ఉపాధ్యక్షుడు హుస్సేన్ అల్-షేక్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాలస్తీనాలో తాజా పరిణామాలపై చర్చించారు. పాలస్తీనా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సమీక్షించారు.

ఈ సమావేశంలో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ ముసాద్ అల్-ఐబాన్, అలాగే పాలస్తీనా ఉపాధ్యక్షుడితో పాటు వచ్చిన ప్రతినిధి బృందం సభ్యులు పాల్గొన్నారు.   
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com