డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్

- September 02, 2025 , by Maagulf
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన  శుభాకాంక్షలు తెలిపిన మంత్రి  దుర్గేష్

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఎన్ని ఒడిదుడుకులు, అవమానాలు ఎదురైనా అంతిమంగా రికార్డు విజయం సాధించిన జన సేనాని పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తున్నారన్నారు.తనకు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం కల్పించిన తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పవన్ ఒక ప్రభంజనం..ఆయన మాట ప్రకంపనం.. జనహితం ఆయన అభిమతం అని అభివర్ణించారు.ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న అంకితభావం చిరస్మరణీయంగా నిలబడుతుందన్నారు.పవన్ కళ్యాణ్‌ సినీ, రాజకీయ ప్రయాణం విశిష్టమైనదని,రెండింటిలోనూ స్టార్ డమ్ సంపాదించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. తెలుగు తల్లికి, తెలుగు కళామతల్లికి ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ అని రాజకీయ, సినీ రంగాల్లో ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు.సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నారని, ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి దుర్గేష్ తెలిపారు.అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు ప్రజల దీవెనలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతున్ని ప్రార్థించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com